Saturday, January 11, 2025

రాజ్యసభ ప్రతిపక్ష నేత రేసులో దిగ్విజయ్ సింగ్, చిదంబరం

- Advertisement -
- Advertisement -

Chidambaram and Digvijay

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. మేలో ఉదయ్‌పూర్ ‘చింతన్ శివిర్’లో ప్రకటించిన పార్టీ ప్రకటించిన ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ సూత్రానికి అనుగుణంగా ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత రాత్రి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో సీనియర్ నేతలు పి. చిదంబరం, దిగ్విజయ సింగ్‌లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పీఠాన్ని అధిష్టించడానికి రేసులో ముందున్నారని తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News