విజయవాడ: ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ సన్నిధి జనసంద్రంగా మారింది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనానంతరం శివాలయం మెట్లు మార్గం వైపు నుంచి దిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇంద్రకలాద్రిపై.. నటరాజ స్వామి ఆలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం (నాగపుట్ట) మహా మండపం వైపు.. ఆలయ కార్యాలయంలోకి పాస్ ఉన్నప్పటికీ వెళ్లేందుకు వారిని నిలుపివేశారు. క్యూ లైన్లు రద్దీ దృష్ట్యా ఘాట్ రోడ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్ ఎదురుగా భక్తులు రద్దీ కొనసాగుతోంది. భక్తుల తీవ్ర ఇబ్బందులు దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 2004 కృష్ణ పుష్కరాలు తొలిరోజు తొక్కసలాట, 2008 జనవరి 8 భవాని దీక్షలు విరమణ వేకువ జామున జరిగిన సంఘటనలు దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది భక్తులు చెబుతున్నారు.
జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
- Advertisement -
- Advertisement -
- Advertisement -