హైదరాబాద్: ఖతర్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఖతర్ ఆధర్వంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఆడపడుచులు పాల్గొని, ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మను పూజించారు. ఎమ్మెల్సీ కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమం కోసం ఖతర్ లో జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతర్ ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియంల వద్ద బతుకమ్మలతో పాట విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబారి డా. దీపక్ మిట్టల్, వారి సతీమణి శ్రీమతి అల్పన మిట్టల్, ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి గారు, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తితో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్య్రమాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించగా గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటల తో ధూమ్ దాం గా పాల్గొన్నారు. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో దాదాపుగా 1500 పైగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఖతర్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -