- Advertisement -
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మహాత్ముని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్‌ఘాట్‌లోని బహదూర్ స్థూపానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్, ప్రధాని మోడీ, తదితరలు నివాళుర్పించారు.
- Advertisement -