Thursday, December 19, 2024

యూపిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: యూపిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భదోహి దుర్గమ్మ మండపంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 42మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

5 killed after fire breaks out at Temple in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News