Thursday, December 19, 2024

గురుగ్రామ్ లో విషాదం.. ముగ్గురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

3 Workers killed after building collapse in Haryana

చంఢీఘర్: హర్యానాలోని గురుగ్రామ్ లో విషాద ఘటన జరిగింది. సోమవారం ఉదయం పాత భవనం కూల్చివేత సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కున్న వారిని బయటకు తీస్తున్నారు.అయితే, భవనం కూల్చివేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనున్నట్లు తెలిపారు.

3 Workers killed after building collapse in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News