న్యూఢిల్లీ: కుర్దిష్ మహిళ మహ్సా అమినీ(22) మరణం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఈరాన్ లో అశాంతి నెలకొందని, దీనికి కారణం అమెరికా, ఇజ్రాయిల్ రెచ్చగొట్టడమేనని, అవి ‘పర శత్రు దేశాలు’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం విమర్శించారు. ‘‘ ఈ అల్లర్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణం. అంతేకాక జియోనిస్టుల పాలను, వారికి ఊడిగం చేసే ఏజెంట్లు కారణం. ఈరాన్ వెలుపల ఉన్న దేశ ద్రోహులు కూడా కారణం’’అని నిందించారు. మహ్సా అమినీ మరణం ఈరాన్ ను కూడా బాధించిందన్నారు. కానీ ఆ కారణంగా బ్యాంకులు, ఖుర్ఆన్, మస్జీదులు,కారులు తగులబెట్టి, మహిళల వస్త్రాలు లాగి నిరసన తెలుపడం కూడా సరికాదన్నారు. ఈ నిరసనలు మామూలుగా చోటుచేసుకున్నవి కావని, కొందరి ప్రోద్బలం వల్ల చెలరేగాయని ఆయన ఆరోపించారు. హిజాబ్ నియమాన్ని పాటించనందుకు మహ్సా అమినీని నైతికతను అమలు పరిచే పోలీసులు నిర్బంధించారు. నిర్బంధంలోనే ఆమె కోమాలోకి వెళ్లిపోగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె మరణం కారణంగా ఈరాన్ లో అశాంతి, అల్లర్లు నెలకొన్నాయి.
హిజాబ్ వ్యతిరేక నిరసనలపై అమెరికా, ఇజ్రాయిల్ ను నిందించిన ఖమేనీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -