Monday, December 23, 2024

విషమంగానే ములాయం ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స

Mulayam health is serious

గురుగ్రామ్(యుపి): ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ను ఇక్కడి మేదాంత ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్(సిసియు)లో చేర్చారు. ఆయనకు సమగ్ర నిపుణుల బృందం వైద్య చికిత్సలు అందచేస్తున్నట్లు ఆసుపత్రి సోమవారం వెల్లడించింది. 80 సంవత్సరాల తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు ఆదివారం సమాజ్‌వాది పార్టీ ప్రకటన చేసింది. ఆగస్టు 22 నుంచి ఆయన మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జులైలో కూడా ములాయం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. కాగా..ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, సోదరుడు శివ్‌పాల్ సింగ్ యాదవ్ ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు.

ములాయం ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు పార్టీ కార్యకర్తలు కూడా ఆదివారం ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని ఆసుపత్రికి రావద్దని పార్టీ విజ్ఞప్తి చేసింది. ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రిలోని ఐసియులో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాజ్‌వాది పార్టీ తన అధికారికి ట్విటర్‌లో ఆదివారం తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందచేస్తామని, దయచేసి ఆసుపత్రికి ఎవరూ రావద్దని కూడా పార్టీ కార్యకర్తలను కోరింది. ఇలా ఉండగా..ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిని గురించి అఖిలేష్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News