గ్రీన్‌ఇండియా చాలెంజ్
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది : నిహారిక కొణిదల
మన తెలంగాణ/హైదరబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్ లో నిహారిక కొణిదల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. నాన్న నాగబాబు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని , ఈ ప్రపంచంలో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి కార్యక్రమం అన్నారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో…
అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్ పేట్ గ్రామంలోని కన్యకాపరమేశ్వరి అలయంలో స్థానిక నియోజకవర్గ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, స్థానిక వైశ్యులతో కలసి తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ సూచనల మేరకు ఎంఎల్‌ఎతో కలిసి ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు ఐవిఎఫ్ పౌలిటికల్ కమిటి చైర్మన్ బచ్చు శ్రీనివాస్, శంబు పాండయ్య, నరేశ్ పాల్గోన్నారు.