- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి సద్దుల బతుకమ్మ ప్రతీక అని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంతోటే విశ్వవ్యాప్త మైన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైందని అన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల సమైక్య పాలన చెర నుండి విముక్తి జరిగిన ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగను వర్తమానానికి అందించిన ఘనత తెలంగాణ ఉద్యమానికే దక్కిందన్నారు.
- Advertisement -