Saturday, April 5, 2025

ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమం

- Advertisement -
- Advertisement -

Mulayam Singh Yadav Health still critical

ల‌క్నో : స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ను మంగళవారం విడుద‌ల చేశాయి. మేదాంత హాస్పిటల్‌ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్న‌ట్లు వైద్యులు తెలిపారు. సమగ్ర నిపుణుల బృందం ఆధ్వర్యంలో ములాయంకు  చికిత్స కొన‌సాగుతోంది. ములాయం సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పార్థిస్తున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ములాయంను గత వారం ఆసుపత్రిలో చేర్చిన ముచ్చట తెలిసిందే. 82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ చాలా రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్‌గా ఉన్నారు. అయితే ఆదివారం అతని పరిస్థితి క్షీణించడంతో కేర్ యూనిట్‌కు మార్చినట్లు వైద్యులు వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్యం స్థిరంగా, మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే మంళవారం ఉదయం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News