భోపాల్: ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ”ఆదిపురుష్” టీజర్‌పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆ చిత్ర దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. హిందూ దేవతామూర్తులను తప్పుగా చిత్రీకరించే సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మిశ్రా హెచ్చరించారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభాస్ రామునిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురునిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆదిపురుష్ ఫస్ట్ టీజర్- ట్రయలర్ ఇటీవలే విడుదలైంది. మంగళవారం నాడిక్కడ మిశ్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఆదిపురుష్ ట్రయలర్ చూశానని, అందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. ట్రయలర్‌లో చూపించిన మేరకు హిందూ దేవుళ్లు ధరించిన దుస్తులు, వారి రూపురేఖలు ఆమోదయోగ్యం కావని ఆయన అన్నారు. హనుమంతుడు చర్మంతో చేసిన దుస్తులు ధరించినట్లు టీజర్‌లో చూపించారని, కాని రామాయణ మహాకావ్యంలో హనుమంతుడిని వర్ణించిన తీరు వేరే విధంగా ఉందని ఆయన చెప్పారు. ఇవి తమ మత భావాలను గాయపరుస్తాయని ఆయన అన్నారు. అటువంటి దృశ్యాలన్నిటినీ చిత్రం నుంచి తొలగించాలని కోరుతూ దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నానని మిశ్రా చెప్పారు. వాటిని తొలగించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
”ఆదిపురుష్” టీజర్‌పై మధ్యప్రదేశ్ మంత్రి అభ్యంతరం
- Advertisement -
- Advertisement -
- Advertisement -