- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు అమలు కావాలని కుమారస్వామి ఆకాంక్షించారు. బిఆర్ఎస్ విజయవంతం కావాలని కోరుతున్నాట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో కర్నాటకలో జరిగే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. జెడిఎస్ ఎమ్మెల్యేలు దేశమంతా కెసిఆర్‌తో కలిసి తిరుగుతారని కుమారస్వామి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ బుధవారం జాతీయ పార్టీ(బిఆర్ఎస్) ప్రారంభించి సంగతి తెలిసిందే.
- Advertisement -