Saturday, November 23, 2024

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో నర్సాపూర్ (జీ) మండల కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు.  బి. గంగాధర్, బి. సుబ్బయ్య, సాజిద్ ఖాన్, రొడ్డ ప్రవీణ్ , రొడ్డ రాజేందర్, బి. సురేష్ తో పాటు 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.

బిఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రకటనతో ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున్న సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.  అంతే కాకుండా దేశ వ్యాప్తంగా సిఎం కెసిఅర్ కు ఉన్న ప్రజాదారణ, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుందని, అదానీ, అంబానీలు కంపెనీలకు కోట్ల రూపాయల  రుణాలను మాఫీ చేస్తూ బడాబాబుల కొమ్ము కాస్తుందని ఇంద్రకరణ్ చెప్పారు. బడుగు బలహీనవర్గాల అభున్నతికి కెసిఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదన్నారు.

సిఎం కెసిఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారని, మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News