- Advertisement -
న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు వివిధ హైకోర్టులకు మొత్తం 153 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని నియామకాలు హైకోర్టులకు జరగనున్నట్లు వర్గాలు తెలిపాయి. గురువారం బొంబాయి హైకోర్టుకు అదనంగా ఆరుగురు న్యాయమూర్తుల నియామకం జరిగింది. కాగా..బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపంకర్ దత్తాను త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం పంపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టుకు జస్టిస్ దత్తా నియమితులు అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యాబలం 30కి పెరుగుతుంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని 34 మంది న్యాయమూర్తుల నియామకానికి మాత్రమే అనుమతి ఉంది.
6 Additional Judges appointed to Bombay High Court
- Advertisement -