- Advertisement -
హాజరైన పంజాబ్ సిఎం దంపతులు
పాటియాలా : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరజ్ వివాహం జరిగింది. రాష్ట్రంలోని సంగ్రూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 28 సంవత్సరాల మహిళా ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త 29 ఏండ్ల మన్‌దీప్ సింగ్‌ను పెళ్లాడారు. పాటియాలాలోని రోరేవాల్ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన భార్య డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. గ్రామంలో సమీప బంధువుల సమక్షంలో గురుద్వారాలో పెళ్లి జరిగింది. ఎమ్మెల్యే ను పెళ్లాడిన కార్యకర్త మన్‌దీప్ సింగ్ లఖేవాల్ గ్రామానికి చెందిన వారు. ఎమ్మెల్యే భరాజ్ లా పట్టభద్రురాలు. లాయర్‌గా కూడా అనుభవం ఉంది. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె రాజకీయ దిగ్గజం, అప్పటి రాష్ట్ర మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాను అత్యధిక ఓట్లతో ఓడించి తన సత్తా చాటుకున్నారు.
- Advertisement -