నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట,
తాడూరు, తెలకపల్లి మండలాల నుంచి
రూ.3లక్షల విరాళం అందించిన పెన్షనర్లు
మన తెలంగాణ/తిమ్మాజిపేట/తెలకపల్లి: కెసిఆర్ స్థాపించిన బిఆర్‌ఎస్‌కు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఆసరా పింఛన్‌దారులు భూరి విరాళం అందించారు. తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు తెలకపల్లి మండల పరిధిలోని పెద్దురు గ్రామం, తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామాలకు చెందిన వారంతా కలిసి పార్టీకి రూ.3లక్షలు అందజేశారు. ఈ విరాళాలను తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, పార్టీ ప్రెసిడెంట్ జోగు ప్రదీప్, ఎంపిపి రవీంద్రనాథ్‌కు లక్ష రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లీలావతి, మార్కెట్ డైరెక్టర్ కవిత, ఉప సర్పంచ్ ఇబ్రహీం, వార్డు సభ్యులు సైఫ్, టిఆర్‌ఎస్ నాయకులు స్వామి, గుమ్మకొండ సర్పంచ్ సత్యం, శ్రీను, కోటేశ్వర్, ఆసరా పెన్షన్ దారులు పాల్గొన్నారు.
అదేవిధంగా తెలకపల్లి మండల పరిధిలోని పెద్దురు గ్రామంలో రూ. 1,01,116 విరాళాన్ని అందజేసినట్లు గ్రామ సర్పంచ్ శైలజ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వృద్ధులకు ఆసరా పింఛన్లు అమలుచేసే దమ్మున్న నాయకుడు కెసిఆర్ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి ఈదుల నరేందర్ రెడ్డి, ఎంపిటిసి ఎం.లింగమయ్య, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాలతో పాటు తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ పింఛన్‌దారులు కూడా లక్ష రూపాయాలను విరాళంగా అందజేశారు.