అనకాపల్లి: మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నం వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేపట్టిన ర్యాలీలో బైక్‌పై నుంచి కిందపడి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టడంతో కాలికి గాయమైంది. వెంటనే ఉమాశంకర్‌ను నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒక కాలుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం నాతవరం మండలం పి.జగ్గంపేట గ్రామం నుంచి గన్నవరం వరకు 1500 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా మహా పాదయాత్రను అడ్డుకోవాలని హెచ్చరించారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర వెనుక టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. మహా పాదయాత్ర నర్సీపట్నంలోకి రాగానే మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు రౌడీలను ఉపయోగించి హింస సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
బైక్‌పై నుంచి పడి వైసిపి ఎమ్మెల్యేకు గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -