Monday, December 23, 2024

లారీ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for lorry theft in Miyapur

మియాపూర్: పార్కింగ్ చేసిన లారీ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం డిసిపి కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిసిపి శిల్పవల్లి కేసుకు సంబంధించిన వివరాలను వెళ్లడించారు. నార్లమల్లేష్ (32), ముడావత్ శ్రీను (32) దుండిగల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు లేబర్ గా పని చేస్తున్నారు. వారికి సంపాదించిన డబ్బు సరిపోకపోవడంతో విలాసవంతమైన జీవితం గడపడానికి నేరాలు చేయాలనుకున్నారు. అదే అదునుగా దొంగతనాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో న్యూ కాలనీలోని శివాలయం ముందు పార్కింగ్ చేసిన లారీని దొంగతనం చేశారు. లారీ యజమాని మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూడగా లారీ కనిపించకపోవడంతో మియాపూర్ పోలీసులకు పిర్యాధు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారిని తనదైన శైలిలో విచారించగా నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ధ నుండి లారీ ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరిలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ దొంగతనం కేసును చేధించిన మియాపూర్ సీఐ తిరుపతి రావు, డిఐ కాంత రెడ్డి,జగదీశ్వర్, క్రైమ్ సిబ్బంది శ్రీకాంత్, సిబ్బందిని డిసిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News