Friday, January 10, 2025

మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే

- Advertisement -
- Advertisement -

Minister Puvvada participated in Munugodu election campaign

కోరిత్కల్: మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మునుగోడులోని కోరిత్కల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుంది, ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదు. మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనం కోసం వచ్చిందని ఆరోపించారు. 18000 వేలకోట్ల కాంట్రాక్టులు తీసుకున్న అని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నాడని మంత్రి పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి తన ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నాడు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ కి జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో మునుగోడు ఎన్నిక తెచ్చారన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు అవుతాయి,మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు ప్రయత్నం చేయలేదన్నారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉన్నదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైందని విమర్శించారు. కెసిఆర్ ని అవహేళన చేసిన వారంతా నేడు చీకట్లో కలిసి పోయారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News