వెల్లింగ్టన్: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం వెల్లింగ్టన్‌లో కొత్త ఇండియన్ హైకమిషన్ ఛాన్సరీని ప్రారంభించి, భారతదేశం, న్యూజిలాండ్ మధ్య ముఖ్యమైన సంబంధాన్ని పెంపొందించడానికి ఒకరి దన్నుతో మరొకరు ప్రయోజనం పొందడం మరింత తెలివైన మార్గమని అన్నారు. భారత విదేశాంగ మంత్రిగా న్యూజిలాండ్ కు తొలిసారి వెళ్లిన జైశంకర్ రెండు దేశాల మధ్య సంబంధాలు అప్ డేట్, రిఫ్రెష్ కావలసి ఉందన్నారు.
“ఈరోజు వెల్లింగ్‌టన్‌లో కొత్త భారత హైకమిషన్ ఛాన్సరీని ప్రారంభించాము. తక్కువ వ్యవధిలో మూడు మంత్రుల పర్యటనలు భారత్-న్యూజిలాండ్ సంబంధాలను పెంపొందించుకోవాలనే మా భాగస్వామ్య కోరికను ప్రతిబింబించాయి” అని జైశంకర్ ఆదివారం ట్వీట్ చేశారు.
This draws strength from the vision and commitment of our Prime Ministers @narendramodi and @jacindaardern.
Possibilities abound in business, digital, agriculture, education, skills, traditional medicine and maritime security domains.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 9, 2022