హైదరాబాద్: బిజెపి కార్లు, బైకులతో నేతలను కొంటోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… 200 కార్లు, 2 వేల బైకులు బుక్ చేసినట్లు సమాచారముందన్నారు. ఇప్పుడు మోటార్లు ఇస్తారు.. రేపు మీటర్లు పెడతారని హరీశ్ రావు ఆరోపించారు. మునుగోడులో టిఆర్ఎస్-బిజెపి మధ్యే పోటీ అన్నారు. దేశ ప్రజల కోసం బిజెపి ఒక్క మంచి పనైనా చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. క్షద్రపూజలు చేయడం బిజెపికి అలవాటన్నారు. బనారస్ కళాశాలలో బూత వైద్యం నేర్పించే చరిత్ర బిజెపిదన్నారు. టిఆర్ఎస్ ది ఉద్యమ చరిత్ర, బిజెపిది రక్త చరిత్ర అని మంత్రి హరీశ్ ఆరోపించారు. 8 ఏళ్లలో 1.52 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం.. ఈ ఏడాది మరో 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. బిజెపికి దమ్ముంటే మునుగొడులో అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు. దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.
ఇప్పుడు మోటార్లు ఇస్తరు.. రేపు మీటర్లు పెడ్తరు: మంత్రి హరీశ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -