పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ పెద్దవంగర మండల తహశీల్దార్ కార్యాలయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మత చిచ్చులు పెడుతున్నాయి. తెలంగాణ ప్రజలు వాటిని తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? ప్రజలు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నది. మీటర్లు పెట్టనిద్దమా? తెలంగాణ రాష్టంలో అభివృద్ధిని చూసి దేశం కెసిఆర్ పెట్టిన జాతీయ పార్టీ ని ఆహ్వానిస్తుందన్నారు. తెలంగాణ తరహా పథకాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు కావాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాకే, పెద్ద వంగరకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాయన్నారు. గతంలో ఒక్కో పనికి ఒక్కో ప్రాంతానికి పెద్ద వంగర ప్రజలు వెళ్లాల్సి వచ్చేది. ఇవ్వాళ పెద్ద వంగరను మండల కేంద్రం చేసుకున్నామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడే తహశిల్దార్ కార్యాలయాన్ని కోటి రూపాయల తో నిర్మించుకుంటున్నాం. ఎంపిడిఓ కార్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మింప చేద్దామని ఆయన తెలిపారు. ఇందుకు స్థలాన్ని ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు. భవనానికి నిధులు ఇచ్చిన కలెక్టర్ కి అభినందనలు చెప్పారు. రాష్ట్రం నుండి పెద్ద వంగర దాకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారింది. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కెసిఆర్ దేశానికి అవసరమని ప్రజలంతా భావిస్తున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారు. సిఎం కెసిఆర్ వస్తేనే, దేశం బాగుపడుతుందని ప్రజలు అంటున్నారు. కెసిఆర్ వల్లే కాంగ్రెస్, బీజేపీ ల పీడ విరగడ అవుతుందని భావిస్తున్నారు. అందుకే సీఎం కెసిఆర్ టిఆరెఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించారు. కెసిఆర్ ను మనమంతా అహ్వానిద్దాం. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం పెద్ద వంగర మండలంలోని 107 డ్వాక్రా మహిళల స్వయం సహాయక సంఘాలకు 6కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలను సంబంధిత మహిళలకు మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు