Monday, December 23, 2024

యుపిలో భారీ వర్షాలు: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే భారీ వర్షాలు కురవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు నీటిలో మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత 24 గంటల్లో యుపిలో పిడిగులు పడి ఐదుగురు దుర్మరణం చెందారు. పిడుగు పాటుతో పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. స్వాయాజ్ పూర్‌లో ఇద్దరు, పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పూర్ మిశ్రా గ్రామంలో ఒకరు, సీతాపూర్ జిల్లా 11 ఏళ్ల బాలిక, ఈతాహ జిల్లా 75 ఏళ్ల వృద్ధురాలు పిడుగుపడి మృతి చెందారు. గోరఖ్ పూర్ ప్రాంతంలో రప్తి నదిలో పడవ మునిగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. గజియా బాద్‌లో ఇల్లు కూలిపోవడంతో 90 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. బులందేశ్వర్ ప్రాంతంలో ఇల్లు కూలిపోవడంతో 14 ఏళ్ల బాలుడి చనిపోయాడు. మహారాజ్‌పూర్ ప్రాంతంలో గోడ కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాల్‌రామ్‌పూర్ ప్రాంతంలో వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News