- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: నిత్యం సోషల్ మీడియాలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ యాక్టివ్‌గా ఉంటారు. అద్భుతమైన, అరుదైన పక్షులు, జంతువుల దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తూ ‘హ్యాపీ సండే’ పేరిట తన ట్వీట్‌లో పొం దుపరుస్తుంటారు. ఈవారం ఇలాంటి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
లేత పెసర పంటను నోట కరుచుకుని వచ్చి ఓ చెక్క కొయ్యకు వేలాడదీసి ఆహారంగా తీసుకుంటున్నఅందమైన ఇండియన్ వైట్‌ఐ పక్షి ఫోటోలను ఎంపి ఈ వారం పోస్ట్ చేశారు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదు అంటూ ప్రకృతిలో పరవశిస్తున్నట్లుగా పక్షి ఫోటోలు ఉన్నాయి. ఇండియన్ వైట్‌ఐ పక్షులు ఎక్కువగా భారతదేశం, ఫిలిఫీన్స్‌తో పాటు, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు ఉండే దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -