హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్ పల్లిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు ఇదే కేసులో విజయ్ నాయర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో సమీర్ మహేంద్ర అనే వ్యక్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం గమనార్హం. ఆదివారం తమ విచారణకు హాజరుకావాలని అభిషేక్ ను సిబిఐ కోరింది. లిక్కర్ స్కామ్ లో సిబిఐ దర్యాప్తునకు సహకరించేందుకు అభిషేక్ నిరాకరించినట్టు సిబిఐ వర్గాలు తెలిపాయి. దక్షిణాది నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ లాబీయింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్ సామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబిన్ డిస్టిలరీస్ కు అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ డైరెక్టర్లుగా ఉన్నారు. 2022 జూన్ 12న వీరిద్దరూ రాబిన్ డిస్టిలరీస్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదు చేశారు. ఇదే కేసులో ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటుంన్నారు.
లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయినపల్లి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -