- Advertisement -
అమరావతి: సుప్రీం కోర్టులో జడ్జిల నియామక ప్రక్రియ తాత్కాలికంగా కొలీజియం నిలిపివేసింది. హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు ఎంపిక చేసే ప్రక్రియను నిలిపివేశారు. కొలీజియంలో ఇద్దరు సీనియర్ జడ్జిల అభ్యంతరం తెలపడంతో నిలిపివేసినట్లు ప్రకటించారు. కొలీజియం తరఫున సుప్రీం కోర్టు ప్రకటన విడుదల చేసింది. సిజెఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలో ఇకపై కొలీజియం సమావేశాలు జరగవని వెల్లడించింది. జడ్జిల నియామక కసరత్తును ప్రస్తుతానికి సుప్రీంకోర్టు కొలీజియం నిలిపివేసింది. జస్టిస్ డివై చంద్రచూడ్ సిజెఐ అయిన తరువాతే కొలీజియం సమవేశమైంది. సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న నలుగురు జడ్జిల నియామకం కోసం లేఖ పంపారు. మిగిలిన నలుగురు న్యాయమూర్తులకు సిజెఐ జస్టిస్ లలిత్ లేఖ రాశారు. ఇద్దరు జడ్జిలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది.
- Advertisement -