Monday, December 23, 2024

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Another case registered against Hyderabad Cricket Association

హైదరాబాద్: హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు అయింది. హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్ సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు రాచకొండ సిపి మహేష్ భగవత్ కి ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్ 26తో హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గడువు ముగిసింది. తనకు గడువు ముగిసిన కూడా తప్పుడు డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి బిసిసిఐ.. ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తరువులు జారీ చేశారని ఫిర్యాదులో పొందుపరిచారు. ఈనెల 18 న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు అయ్యేందుకు అజరుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు కంప్లైంట్ లో ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు కింద ఐపిసి ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ మాజీ హెచ్ సి ఏ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News