న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,16,394కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 27,374 యాక్టివ్ కేసులున్నాయి. అదే సమయంలో ఈ మహామ్మారి నుంచి 2,654 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని తెలిపింది. అదే సమయంలో మరో ఎనిమిది కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,822కి చేరుకుంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 0.06 శాతంగా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.02 శాతం ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.