Monday, January 20, 2025

బిజెపికి తొత్తు పికె: విహెచ్

- Advertisement -
- Advertisement -

VH demands jagan to put sanjeevaiah name to kurnool

హైదరాబాద్: గతంలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తరువాత సర్వేలు జరిగేవని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. మంగళవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. సర్వేలు చెప్పేవారు కుడా పాదయాత్ర చేస్తున్నారని, పార్టీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు పైసలు ఇస్తే వారికి సర్వేలు చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు  పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. రాహుల్ గాంధీ లాగా ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్ర చేస్తే ఎవరు గుర్తు పడుతారని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ లో  కాంగ్రెస్ కు సలహాలు ఇచ్చి ఆ పార్టీని ఖతం చేశావని విహెచ్ మండిపడ్డారు. నువ్వు ఏమైనా త్యాగం చేశావా? ప్రజల కోసం పోరాడవా? అని అడిగారు. డబ్బుల కోసం నువ్వు సర్వేలు చేస్తావని, నితీష్ కుమార్ అందరం కలిసి సెక్యులర్ పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా పోరాట చేస్తున్నాయని, బిజెపికి తొత్తుగా నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా ఎందుకు పాదయాత్ర చేస్తున్నావని పికెను నిలదీశారు.

ప్రశాంత్ కిషోర్ ను ఎవరు నమ్ముతారని దుయ్యబట్టారు. నిన్నటి వరకు బిజెపికి వ్యతిరేకం అన్నావు మతతత్వ పార్టీకి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తున్నావని ప్రశాంత్ పై విహెచ్ మండిపడ్డారు. కొడుకు కోసం తల్లి సోనియా గాంధీ కూడా పాదయాత్ర చేస్తుందని కొనియాడారు.  ప్రశాంత్ కిషోర్ ఒక బిజినెస్ మెన్ అని, బిజెపి అడిస్తున్నా నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా పికె మట్లాడుతున్నారని, పికె పార్టీ పెట్టడం బిజెపి ఆలోచన అని, బిజెపికి తొత్తుగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో కాంగ్రెస్ ఆఫీస్ ని తగులబెట్టారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News