Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఢిల్లీ ఆఫీసును సందర్శించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ కోసం సిద్ధమవుతున్న పార్టీ కార్యాలయాన్ని మం గళవారం సిఎం కెసిఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ములాయం సింగ్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత కెసిఆర్ యుపి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో నూతన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్తగా ప్రకటించిన బిఆర్‌ఎస్ కార్యాలయం కోసం సర్దార్ పటేల్ మార్గ్‌లోని జోద్‌పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. ఈ కార్యాలయాన్నే కెసిఆర్ పరిశీలించారు.టిఆర్‌ఎస్ పేరును మార్చిన తర్వాత కెసిఆర్ ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఆయన మరో మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News