న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సస్ మరియు కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ లో అంతర్జాతీయంగా అగ్రగామి, గత 13 సంవత్సరాలుగా మేజర్ అప్లయెన్సస్‌లో ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్ గా వెలుగొందుతున్న హయర్ నేడు తమ నూతన ఏఐ ఆధారిత విప్లవాత్మక వాషింగ్ మెషీన్ సిరీస్ హయర్ 979 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను అత్యాధునిక సూపర్ సైలెంట్ డైరెక్ట్ మోషన్ మోటర్, 52.5 సెంటీమీటర్ల సూపర్ డ్రమ్‌తో విడుదల చేసింది. హయర్ యొక్క మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా లక్ష్యంకు అనుగుణంగా ఈ కంపెనీ భవిష్యత్ సిద్ధమైన స్మార్ట్ హోమ్, ఏఐ, ఐఓటీ ఆధారిత లాండ్రీ పరిష్కారాలను ప్రీమియం వాష్, ఫ్యాబ్రిక్ కేర్ కోసం నూతన తరపు సాంకేతికతలతో అందిస్తుంది. ఫ్రంట్ లైన్ ఆవిష్కరణలను కూడిన ఈ సూపర్ డ్రమ్ 979 సిరీస్ డైరెక్ట్ మోషన్ మోటర్ కలిగి ఉండటంతో పాటుగా కేవలం వాయిస్ కమాండ్‌తో దీనిని వినియోగించవచ్చు.
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కన్స్యూమర్ డ్యూరబల్స్ కంపెనీగా హయర్ స్ధిరంగా తమ మార్కెట్ వాటాను 5%కు తమ నూతన శ్రేణి ఐఓటీ ఆధారిత ఉత్పత్తులతో పెంచుకుంటుంది. ప్రీమియం విభాగపు అవసరాలను తీర్చే ఔట్‌లెట్లలో ప్రధానంగా ఇది పెట్టుబడులు పెడుతుంది. భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా ప్రీమియం ఉత్పత్తుల జాబితాను బలోపేతం చేయడంపై హయర్ దృష్టి సారించింది. పూనెలోని రంజన్‌గావ్‌తో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సంస్థకు అత్యాధునిక తయారీ కేంద్రాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రీమియం, హై ఎండ్ ఉత్పత్తులలో ఆవిష్కరణలపై ఇది దృష్టి సారించింది.
నూతన శ్రేణి వాషింగ్ మెషీన్‌ల విడుదల గురించి హయర్ అప్లయెన్సస్ అధ్యక్షులు శ్రీ సతీష్ ఎన్‌ఎస్ మాట్లాడుతూ ‘‘హయర్ వద్ద మేము వినియోగదారుల సౌకర్యంకు కట్టుబడి ఉన్నాము మరియు ప్రతి రోజూ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే ఆవిష్కరణలను పంచుకోవడానికి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నాము. మా నూతన ఐఓటీ ఆధారిత ఫ్రంట్ లోడ్ సూపర్ డ్రమ్ 979 సిరీస్ వాషింగ్ మెషీన్ విప్లవాత్మక ఆవిష్కరణ. ఇది అత్యాధునిక ఏఐపై ఆధారపడటంతో పాటుగా అతి సులభమైన, తెలివైన, వ్యక్తిగతీకరించిన లాండ్రీ పరిష్కారాలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నూతన శ్రేణి మరింతగా వినియోగదారుల జీవనశైలి పెంచడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము’’అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘ వినియోగదారుల జీవితానికి స్ఫూర్తి కలిగించే అవకాశం ఈ పండుగ సీజన్ మాకు కలిగించింది. వాషింగ్ మెషీన్ విభాగంలో మా మార్కెట్ వాటాను 5% పెంచనుందని భావిస్తున్నాము. మా భావితరపు ఐఓటీ ఆధారిత ఉత్పత్తి సిరీస్ దీనికి తోడ్పడనుంది.ఈ నూతన ప్రొడక్ట్ లైనప్ అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లతో ఉంది. ఈ వేడుకలలో భాగం కావడం సంతోషంగా ఉంది మరియు ఈ పండుగ సీజన్‌లో వారికి మహోన్నత స్ఫూర్తినీ అందించనున్నాము’’అని అన్నారు.
979 సూపర్ డ్రమ్ సిరీస్– ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్
ఈ నూతన వాషింగ్ మెషీన్స్ లో హయర్ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటర్ కలిగి ఉంది. ఇది గణనీయంగా మెషీన్ యొక్క వైబ్రేషన్స్ తగ్గించడంతో పాటుగా శబ్దంలేని పనితీరును అందిస్తుంది. అలాగే వాషింగ్ మెషీన్ మన్నిక సైతం మెరుగుపరుస్తుంది. ఐఓటీ ఆధారిత ఫీచర్లు మరియు కృత్రిమ మేథస్సు వంటివి మహోన్నత లాండ్రీ అనుభవాలను అందిస్తాయి. ఈ వాషింగ్ మెషీన్‌లో పరిశ్రమలో మొట్టమొదటిసారిగా, అంతర్గతంగా నిర్మించిన వాయిస్ కంట్రోల్ సాంకేతికత ఉంది. ఇది టచ్ ప్యానెల్‌తో వస్తుంది. అందువల్ల మీరు వాషింగ్ మెషీన్‌కు కమాండ్స్ అందించడంతో పాటుగా మీ ఇంటిలో ఏ మూల నుంచి అయినా మీరు మీ వాషింగ్ మెషీన్‌ను ఆదేశించవచ్చు. దీనికి కావాల్సిందల్లా వై–ఫై కనెక్షన్ మాత్రమే. అంతేకాదు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో ఏఐ –డీబీఎస్ (డైనమిక్ బ్యాలెన్స్ సిస్టమ్) ఉంది. ఇది వాషింగ్ మెషీన్ స్ధిరంగా మరియు నిశ్శబ్దంగా మొత్తం వాష్ సైకిల్‌లో పనిచేస్తుందనే భరోసా కల్పిస్తుంది.
ఈ అత్యాధునిక వాషింగ్ మెషీన్‌లో 52.5 సెంటీమీటర్ల సూపర్ డ్రమ్ ఉంది. ఈ మెషీన్ 30+ వాష్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ, డ్యూయల్ స్ర్పే టెక్నాలజీ, ప్యురి స్టీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర, లభ్యత, వారెంటీ: హయర్ నూతనంగా విడుదల చేసిన ఈ వాషింగ్ మెషీన్లు దేశవ్యాప్తంగా ఈ దిగువ ధరల్లో లభ్యమవుతాయి.