Monday, January 20, 2025

మూడు యుగాల కథాంశంతో..

- Advertisement -
- Advertisement -

'Ajayante Randam Moshanam' Film Pooja Ceremony

స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ’అజయంతే రందం మోషణం’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ క్యారెక్టర్స్ మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషించనున్నారు. సుజిత్ నంబియార్ ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ‘అజయంతే రందం మోషణం’ పాన్- ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ కృతి శెట్టికి ఇది మొదటి మలయాళ చిత్రం. యూజీఎం ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేజిక్ ఫ్రేమ్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనుంది. ఈ సినిమా కథలో కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత వుంది.

‘Ajayante Randam Moshanam’ Film Pooja Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News