Friday, January 10, 2025

భార్యను చంపాలనుకున్నాడు కానీ అత్త చనిపోయింది…

- Advertisement -
- Advertisement -

Shock

మన తెలంగాణ /బెతుల్ న్యూస్: భార్యను చంపాలని ప్లాన్ వేశాడు కానీ భార్యకు బదులు అత్త చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాస్ట్రం బెతుల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయిఖేడా గ్రామంలో ఓ వ్యక్తి మధ్యం అలవాటు పడ్డాడు. ప్రతీ రోజు మధ్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. ఆదివారం ఫుల్‌గా మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. వెంటనే ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. వెంటనే మరుసటి రోజు అత్తగారింటికి వెళ్లాడు. అక్కడే భార్యను చంపాలని ఫ్లాన్ వేశాడు. భార్య, అత్త బయటకు వెళ్లినప్పుడు కరెంట్ వైర్‌ను మెయిన్ డోర్‌కు తగిలించాడు. అత్త డోర్ పట్టుకోగానే కరెంట్ షాక్‌తో దుర్మరణం చెందింది. వెంటనే అల్లుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News