హైదరాబాద్: మాజీ సి ఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ ను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. రాచకొండ పోలీసులు 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేప్ అండ్ కిడ్నాప్ కేసు లో నాగేశ్వర్ రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు సిఐ జైల్లో ఉన్నారు. ఇటీవల బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్ నాగేశ్వర్ రావును సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం మాజీ సి ఐ నాగేశ్వర్ రావును సర్వీస్ నుంచి ఉన్నతాధికారులు తొలగించారు. నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేస్ లో అన్ని సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలను పోలీసులు పొందుపరిచారు. సిసి ఫుటేజ్ వివరాలు, డి ఎన్ఎ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. నాగేశ్వర్ రావుకు తగిన శిక్ష పడేలా కోర్టులో అన్ని ఆధారాలను పోలీసులు సమర్పించారు.
సిఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -