Monday, December 23, 2024

పోలీసుల బస్సును ఢీకొట్టిన బైక్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

Three Members dead in Bike collided with Bus

 

పాట్నా: పోలీసుల బస్సును బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరొకరు సజీవదహనమైన సంఘటన బిహార్ రాష్ట్రం చప్రా-సివాన్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం సితాబ్ దియారా ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ నిర్వహించారు.

పోలీసులు విధులు ముగించుకొని బస్సులో వెళ్తుండగా ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి బస్సును ఢీకొట్టారు. ఇద్దరు యువకులు కొంచెం దూరంలో పడి చనిపోయారు. బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద చిక్కుకొని వంద మీటర్లు దూరం బస్సు దూసుకెళ్లింది. బస్సు ట్యాంకుకు బైక్ ఢీకొనడంతో యువకుడు సజీవదహనమయ్యాడు. బస్సులో మంటలు చెలరేగుతున్న సమయంలో అందరూ దూకారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News