Friday, December 20, 2024

ప్రతి ఒక్క ఓటరుని చేరుకునేలా కార్యక్రమాలు: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Minister gangula kamalakar by-election campaign in munugode

సంస్థాన్ నారాయణపురంలో శ్రేణులకు దిశానిర్దేశం

నల్గొండ: మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మంత్రి గంగుల కమలాకర్ సంస్తాన్ నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, పోలింగ్ బూతుల వారి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రేపు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. మఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా వాటి పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరుని చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించడంతోపాటు వారికి ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా అర్థం అయ్యేలా వివరించాలన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖరారు అయిందని, మెజార్టీ కోసమే మనమంతా ప్రచారం చేస్తున్నామని శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, గాదరి కిషోర్, సంస్థాన్ నారాయణపూర్ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, ఫాక్స్ చైర్మన్ జంగారెడ్డి, టిఆర్ఎస్ నేతలు తెలంగాణ బిక్షం, చిలువేరు బిక్షం, రాము, శంకర్, పల్లె గోవర్ధన్ రెడ్డి తదితరులతో పాటు ప్రచారానికి వచ్చిన కరీంనగర్ శ్రేణులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News