న్యూఢిల్లీ: దేశంలో నాలుగవ వందే భారత్ ఎక్సెప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ప్రారంభిస్తారు. అంతేగాక..ఐఐఐటి ఉనాను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు. జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఓ) బుధవారం తెలిపింది. అంబ్ అందౌరా, న్యూఢిల్లీ మధ్య నడిచే నూతన వందే భారత్ ఎక్సెప్రెస్ రైలును ప్రధాని ప్రారంభిస్తారు. దేశంలో ఇది నాలుగవ వందే భారత్ ఎక్సెప్రెస్ రైలు. ఇదివరకటి రైళ్లతో పోలిస్తే ఇది మరింత అధునాతనమైనదని, తేలికపాటిదే కాక మరింత వేగంగా నడుస్తుందని పిఎంఓ తెలిపింది. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు ఈ రైలు సర్వీసులు ఉంటాయి. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో స్టాపింగ్ ఉంటుంది. 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ రైలు అందుకుంది. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
హిమాచల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రేపు ప్రధాని పచ్చజెండా
- Advertisement -
- Advertisement -
- Advertisement -