- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలేజీలు, యూనివర్సిటీల వరకు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ హాజరును తప్పని సరి చేశారు. బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు కూడా బయో మెట్రిక్ హాజరు ఇక తప్పనిసరి కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పనిచేస్తున్నారు, వారి సెలవులు, ఇతరత్రా విషయాలకు కూడా బయోమెట్రిక్ ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Advertisement -