Monday, January 20, 2025

పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

Supreme Court hearing on lumpy skin disease of cattle on 31st

న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్‌ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో ఈ పిటిషన్‌ను చేర్చారు. సుప్రీం చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ విచారణ చేపడుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాధికి 67,000 పశువులు బలి అయ్యాయని పిటిషన్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దోమలు, ఈగలు, తదితర కీటకాల వల్ల సంక్రమించే ఈ వ్యాధి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది. ఈ వ్యాధిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు నివారించే ప్రయత్నంలో ఉన్నాయని, స్వదేశీయంగా దీని నివారణకు వ్యాక్సిన్ తయారైందని ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 12 న అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ సదస్సులో ప్రకటించారు. ఢిల్లీలో జోన్లవారీగా ఈ కేసు నివారణకు వెటర్నరీ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఢిల్లీ హైకోర్టు సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News