- Advertisement -
హైదరాబాద్: నగరంలో కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండా-అఫీషియల్ అనే అధికారిక పేరుతో ఒక ముఠా పెట్రేగిపోతుంది. ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తోంది. వీడియోలు పోస్టు చేసి ఓ వర్గం యువతులను టార్గెట్ చేస్తోంది. తమ కమ్యూనిటీని డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాక్ లైన్ తో పోస్టులు చేస్తున్నారు. రోజు రోజుకు ఝాముండా పేజ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ పలువురు పోలీసులకు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఝాముండ పేజ్ పై 506,509,354(D), సెక్షన్ల కింది మూడు కేసులు నమోదు చేశారు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -