Friday, December 20, 2024

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దీపావళి బోనస్‌గా పేర్కొనే పెర్ఫార్మెన్స్ లింక్‌డ్ రివార్డు స్కీమ్(పిఎల్‌ఆర్‌ఎస్) బోనస్‌ను రూ.296 కోట్లను పండుగకు ముందు నెల 21న చెల్లించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఈ మేరకు సింగరేణి కార్మికులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. గరిష్ఠంగా ఒక్కో కార్మికుడు దీ పావళి బోనస్ కింద రూ.76,500 వరకు అందుకోనున్నారని, ఈ బోనస్ ను కార్మికుల ఖాతాల్లో ఈ నెల 21న జమ చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సింగరేణి ఫైనాన్స్, అండ్ అ కౌంట్ విభాగాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికులు గత ఏడాది ఉత్పత్తి లక్షాల సాధనలో విశేషమైన కృషి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 30 శాతం లాబాల వాటా బోనస్‌గా 368 కోట్ల రూపాయలను దసరా పండుగకు ముందు పంపిణీ చేశామని, అలాగే పనితీరు ఆధారంగా చెల్లించే పిఎల్‌ఆర్ బోనస్ రూ.296 కో ట్లను కూడా సిఎం ఆదేశం మేరకు దీపావళి పండుగకు ముందు ఈనెల 21న చెల్లిస్తున్నామని తెలిపారు. రెండు కలిపి సగటున ఒక్కో కార్మికుడు లక్షా 60 వేల రూపాయవల వరకు పొందుతున్నందున వీటిని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, సాధ్యమైనంత వరకు పొదుపు చేసుకోవాలని ఆయన సూచించారు. కష్టపడితే ఉత్పత్తి లక్షాలను సాధించడంతో పాటు ఇటువంటి బోనస్‌లను కూడా పెద్ద మొత్తంలో అందుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు పంపిణీ చేస్తున్నందున రెండు బోనస్‌లను అందుకునే సదవకాశం కేవలం సింగరేణి కార్మికులకే దక్కుతుందని అన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్‌కు కార్మికుల తరఫున సిఎండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది కూడా నిర్దేశిత 700 లక్షల టన్నుల బొగ్గు లక్షాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం, ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

TS Govt announces diwali bonus to Singareni Workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News