Monday, November 25, 2024

బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు నమ్మరు: మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

Minister koppula eshwar election campaign in munugode

నల్గొండ: బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు నమ్మరని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే భయపడి బిజెపి నేతలు తెలంగాణలో కుట్రలకు తెరలేపారని మంత్రి కొప్పుల ఆరోపించారు. మునుగోడు నియోజక వర్గం ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. చండూరు మండలం బొడంగి పర్తి, తాస్కనిగుడం , శిర్ధేపల్లిలో గ్రామస్తులను మంత్రి కలిశారు. మునుగోడులో ఏ గ్రామానికి పోయినా టిఆర్ఎస్ కి జై కొడుతున్నారని చెప్పారు. సబ్బండ వర్గాలు ప్రచారంలో కలిసి వస్తున్నాయని చెప్పారు. దళితులపైన దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే బీజేపీని తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. మోడీ హట్టర్ ప్లాప్ ప్రధాని అని… అన్ని సంస్థ లను అమ్మి దేశాన్ని కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పుతున్నాడని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకొని, బీజేపీ రాజకీయాలు చేస్తున్నదన్నారు.

మోకాళ్లపై నడిచిన మునుగోడు ప్రజలు బీజేపీని నమ్మరన్నారు మంత్రి కొప్పుల. బీజేపీకి ఓటేస్తే రైతులకు కష్టాలు వస్తాయన్నారు.. మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తారని… అన్నదాతలు జాగ్రత్తగా ఉంటూ బీజేపీని దరి చేరనీయొద్దని సూచించారు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏనాడు తమ ఊరికి రాలేదని ప్రజలే చెబుతున్నారన్నారు. ఓడినా ప్రజల మధ్య ఉన్న నాయకుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి… మంత్రి కేటీఆర్ రోడ్ షో తర్వాత నియోజకవర్గంలో ఉత్సాహం నెలకొన్నదన్నారు. క్యాడర్ అంత జోష్ చూస్తుంటే ఉప ఎన్నికల్లో విజయం ఖాయం అని నిరూపితం అవుతుందన్నారు. ప్రతి ఓటరుతో మాట్లాడుతూ, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరా తీశారు. పలు చోట్ల ప్రజలతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు పార్టీ నేతలు హరినాథ్ రావు, గోలీ సురేందర్ రెడ్డి, లోక మల్లారెడ్డి, ఎర్రవెని రమేష్, జలందర్, తిరుపతి నాయక్, మాడిగల తిరుపతి,గుర్రం వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News