త్రివేండ్రం: కేరళలోని చేపలు అమ్మేవ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడన్న కారణంతో బ్యాంకు జప్తు నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే రూ.70లక్షల లాటరీకి తగలటంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పుకుంజు అనే చేపలు అమ్మే వ్యక్తి అక్టోబర్ 12న కేరళ ప్రభుత్వ ఆధర్యంలోని లాటరీ టికెట్ కొన్నాడు. అనంతరం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న అతడికి నుంచి తీసుకున్న రూ.9లక్షల రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇంటిని జప్తు చేయనున్నామని బ్యాంక్ నోటీసులు అందాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నామని పుకుంజు భార్య తెలిపింది. అయితే కీలక సమయంలో అదృష్టం ఆ కుటుంబాన్ని ఆదుకుంది. లాటరీ ఫలితాల్లో అతడు కొన్న టికెట్‌కే రూ.70లక్షల మొదటి బహూమతి లభించింది. కొద్దిగంటల వరకు పీకల్లోతు అప్పుల్లోఉన్న వ్యక్తి ఒక్కసారిగా మిలియనీర్‌గా మారిపోయాడు. లాటరీ డబ్బుతో ఉన్న అప్పులన్నీ తీర్చేసి డబ్బును తమ పిల్లలకు మంచి చదువులుకు వినియోగించి.. వారు భవిష్యత్తులో మంచిస్థాయికి చేరుకునేలా కృషి చేయాలని నిర్ణయించుకున్నామని భార్య తెలిపింది.