గుడివాడలో భారీ కటౌట్లు కర్నాటకలో మద్దతు ప్రకటించిన కెఆర్‌టిఎ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి పలు రాష్ట్రాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోం ది. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అయితే సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలుపుతూ పెద్దఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను నెలకొల్పుతున్నారు. బిఆర్‌ఎస్‌ను స్వాగతిస్తూ భారీగా సం ఖ్యలో బ్యానర్లను నెలకొల్పుతున్నారు. ఇందులో ఎపి, కర్నాటక, మహరాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా బిఆర్‌ఎస్ ప్ర భావం కనిపిస్తోంది. కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కెఆర్‌టిఎ) కూడా బిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో కెఆర్‌టిఎ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల విలేకరులతో మా ట్లాడుతూ, జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్‌ల కు బలమైన ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ అవతరిస్తుందన్నారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని తెలంగాణ సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంపై కర్నాటకలోని పలు సంఘాలు, ఇతర రా జకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నా రు. గతంలో కర్నాటకలో జిల్లాలు ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో యూనిట్లను కలిగి ఉన్న కెఆర్‌టి ఎ, తెలంగాణ మోడల్‌తో బిఆర్‌ఎస్ దేశానికి అభివృద్ధి నమూనాను అందజేస్తుందన్నారు. బిఆర్‌ఎస్‌కు జెడిఎస్ మద్దతు తెలపడం వల్ల భవిష్యత్తులో తెలుగు జాతి అభివృద్ధి చెందుతుందని సందీప్ మక్తాల అన్నారు. ఈ కార్యక్రమంలో కెఆర్‌టిఎ సెక్రటరీ జనరల్ సభ్యులు విజ య్ రెడ్డి, భవ్య, యశస్విని, నాగలక్ష్మి, మధు, లక్ష్మణ్ యాదవ్ కుర్ర, ఆసిఫ్ తదితరులున్నారు.
గుడివాడ పట్టణంలో భారీ కటౌట్లు
టిఆర్‌ఎస్ టు బిఆర్‌ఎస్ పేరుతో గుడివాడ పట్టణంలో భారీ కట్ అవుట్లు ఏర్పాటు చేయడంతో కె సిఆర్ ప్రభంజనం గుడివాడ పట్టణానికి సైతం వ్యాపించిందన్న విషయం తేటతెలమైంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువత రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టిఆర్‌ఎస్ టు బిఆర్‌ఎస్, జాతీయ పార్టీని ప్రారంభించిన కె సిఆర్‌కు అభినందనలు తెలియజేసే విధంగా పెద్దఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. గుడివాడ ఎం ఎల్‌ఎ కొడాలి నాని ఆంధ్రాలో కెసిఆర్ పార్టీకి పె ద్దగా ప్రజా ఆదరణ ఉండదని మాట్లాడిన రెండు రోజుల్లో కటౌట్లు, ప్లెక్సీలు వెలిశాయి.