Monday, December 23, 2024

‘నిఘా’ నీడ

- Advertisement -
- Advertisement -

మునుగోడులో మోహరించిన ప్రత్యేక బృందాలు

పార్టీల తప్పులను లెక్కిస్తున్న పరిశీలకులు ఎన్నికల సంఘానికి చేరిన తప్పుల చిట్టా 2,564 ఎన్నికల కోడ్
ఉల్లంఘన కేసులు రికార్డుస్థాయిలో 14 ఫ్లయింగ్ స్కాడ్‌లు కోడ్ ఉల్లంఘనలపై 16 టీమ్స్ మునుగోడుపై
ఈసీ ప్రత్యేక దృష్టి భారీగా నమోదవుతున్న కేసులు 33మంది అనుమానితుల అరెస్టులు

మన తెలంగాణ / హైదరాబాద్: మునుగోడు అ సెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఉద్దేశ్యంతోనే పరిశీలకులు, భద్రతా అధికారులు, కేంద్రం నుంచి ప్రత్యేక బృం దాలను మునుగోడులోకి దింపింది ఎన్నికల సం ఘం. సాధారణంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కేవలం రెండు లేక మూడు ఫ్లయ్యింగ్ సా డ్‌లు చేసే అవసరం ఉంటుందని, కానీ ఒక్క ము నుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో విధులు నిర్వర్తించేందుకు ఏకంగా 14 ఫ్లయ్యింగ్ స్కాడ్‌లను కేంద్ర ఎన్నికల సం ఘం రంగంలోకి దింపింది. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలకే కాకుండా ఇతర ప్రజా సంఘాలు, ఇండింపెండెంట్ అభ్యర్థులు కూ డా ఎన్నికల బరిలో నిలిచినందున వేల సంఖ్యలో పోలీసులు, ఎక్సైజ్ శాఖకు చెందిన ప్రత్యేక బృం దాలను నాలుగు చొప్పున దింపారని అధికార తెలిపాయి.

ముఖ్యంగా టిఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మునుగోడు ఉప ఎ న్నికలను రాజకీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతోనే కేంద్ర ఎన్నికల సంఘం మ రింత పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. ఎలాగైనా గెలవాలనే ఛాలెంజ్‌తో మూ డు ప్రధాన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల ద్వితీ య, తృతీయశ్రేణి నాయకులు, కిందిస్థాయిలో పనిచేసే కేడర్ తప్పకుండా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడతారనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లను భారీగా నియోజకవర్గంలో దింపింది. ఇప్పటికే ఎన్నికల అక్రమాలకు పాల్పడేవారి గత చరిత్రను పరిశీలించి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 25 మందిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఎక్సైజ్‌శాఖ నియమ, నిబంధనలను కూడా ఉల్లంఘించే ఘనుల్లో ఇప్పటి వరకూ ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏకంగా 2,564 ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇఓ) వికాస్‌రాజ్ తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు.

అంతేగాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పర్యటించేందుకు 14 ఫ్లయ్యింగ్ స్కాడ్‌లతో పాటుగా ఏడు బృందాల వీడియో నిఘా అధికారులనే కాకుండా 18 స్టేషనరీ సర్వేలెన్స్ బృందాలను కూడా నిత్యం అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండానే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటుగా వేలాది మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఇప్పటి వరకూ 40 బెల్ట్ షాపులను 12.5 లక్షల రూపాయల విలువైన మద్యంను పట్టుకొన్నామని సిఇఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో మరో ముగ్గురు అదనపు పరిశీలకులను కూడా మునుగోడుకు పంపించామని, అంతేగాక పోలీస్ విభాగం చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించేందుకు మరో బృందాన్ని మునుగోడుకు పంపించామని తెలిపారు. అంతేగాక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థ్ధులు, వారి పార్టీల నాయకులు, కార్యకర్తలు వినియోగించే వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, వారి ఖర్చులన్నింటినీ లెక్కించేందుకు ప్రత్యేకంగా ఒక ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లను కూడా మునుగోడులో పర్యటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పంపించింది.

ఒకవైపు శాంతి భద్రతలను పరిరక్షించేందుకు యూనిఫాంలో పోలీసు బలగాలు పనిచేస్తున్నాయని, మరోవైపు ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలున్నట్లుగా ముందుగానే తెలుసుకొని తగిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే ఘనుల భరత పట్టడానికి, వారిపైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కోడి, మందు బాటిల్ పంపిణీ చేసిన టిఆర్‌ఎస్ నేత రాజనాల శ్రీహరి ఘటనపైన కూడా సి.ఇ.ఓ. వికాస్‌రాజ్ స్పందించారని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ ఘటన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగలేదని, వరంగల్లు జిల్లాలో జరిగిన ఘటనకు తేలిందని అధికారులు సి.ఇ.ఓ.వికాస్‌రాజ్‌కు నివేదించారు. ఇలా అన్ని కోణాల నుంచి మునుగోడుపై నిఘా నేత్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేసిందని వివరించారు. అయినప్పటికీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ఈ ఏర్పాట్లు సరిపోతాయా? లేదా?, అక్రమార్కుల ఎత్తులు పైఎత్తులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ) ఎంత మేరకు నియంత్రించగలుగుతుందో వేచిచూడాలి మరి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News