హైదరాబాద్: వర్షం నగరవాసులకు ప్రత్యేక్ష నరకాన్ని చవిచూపుతోంది. కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మెహదీపట్నంలో వర్షం కురిసింది. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. మరో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతుండగా, ఇళ్లలోకి తరుచు వరద నీరు చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందలకు గురికావడం సాధారణంగా మారింది. ప్రభుత్వం ఒక్కవైపు నగరంలో మౌలిక సదుపాయాలకు కల్పను వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, మరోవైపు వర్షం కారణంగా దెబ్బతింటుండడంతో వందల కోట్లు నష్టం చవి చూడాల్సి వస్తోంది. వర్షం కురిసిన పలు సార్లు నగరాన్ని వరద ముంచెత్తడంతో నగరవాసులను సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. అంతేకాకుండా నగరం తరుచు వరద ముంపుకు గురవుతుండడం, పలు కాలనీలు బస్తీలు, రెండు నుంచి వారం రోజులు కూడా వరద నీరు నిలిచే ఉండడంతో ఇళ్ల నాణ్యత ప్రమాణాలు సైతం దెబ్బ తింటున్నాయి. దీనికి తోడు చెరువులు, కుంటలు అక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వీటి వరదపోటుతో పరసరా ప్రాంతాలు కోతకుగురికావడం, అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వరద నీరు చేరుతుండడంతో పునాధులు బలహీనంగా మారుతుండడంతో ఎప్పుడు ఏలాంటి ప్రమాదం ముంచుకోస్తుందో కూడ తెలియని పరిస్థితి నెలకొంది.