Monday, December 23, 2024

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

- Advertisement -
- Advertisement -

Two RTC buses collided in nizamabad

మాక్లూర్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే తెలుసుకున్న మాక్లూర్ ఎస్సై యాదగిరి గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని 108 వాహనానికి సమాచారం అందించి తరలించారు. పై అధికారులకు సమాచారం అందించిన మాక్లూర్ ఎస్సై యాదగిరి గౌడ్ సమాచారం అందుకున్న ఎసిపి వెంకటేశ్వర్లు, సిఐలు నరేష్, నరహరి, ఆర్టీసీ మేనేజర్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. వరంగల్ నుంచి నిజామాబాద్ వైపుకు వస్తున్న బస్సుకు రిపేరు కావడంతో బస్సును పక్కకు ఆపేశారు. నిర్మల్ నుంచి వస్తున్న బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. వెనుక నుంచి ఈప్రమాదంలో బస్సులో ప్రయాణీస్తున్న 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, కండక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News