న్యూఢిల్లీ : ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) తాజా నివేదికను భారత్ తప్పుబట్టింది. ఆకలిని సరైన ప్రామాణిక సూచీలతో కొలవలేదని వ్యాఖ్యానించింది. ఆకలి సూచీలో ప్రపంచంలో భారత్ 107 వ స్థానానికి పడిపోయినట్టు నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాము తీవ్రంగా ఆవేదన చెందామని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జీహెచ్‌ఐ పరిగణన లోకి తీసుకున్న నాలుగు అంశాల్లో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవేనని, దీనిని జనాభా మొత్తానికి ఆపాదించలేమని వ్యాఖ్యానించింది. “పోషకాహార లోపాన్ని 3000 మందిని ఒక యూనిట్‌గా భావించి లెక్కిస్తారు. ఇది సరైన విధానం కాదు. దీనివల్ల సరైన ఫలితాలు రావు. వాస్తవికత దెబ్బతింటుంది. అంతేగాకుండా కొవిడ్ సమయంలో జనాభాకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో చర్యలు తీసుకుంది. దీనిని ప్రాతిపదికగా తీసుకోవడం సమంజసం కాదు” అని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచ ఆకలి సూచీ నివేదికను తప్పుబట్టిన భారత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -