Thursday, December 26, 2024

గలిగోటియాస్ యూనివర్సిటీ విద్యార్థి మృతి…

- Advertisement -
- Advertisement -

Murder

మనతెలంగాణ/ గ్రేటర్ నోయిడా న్యూస్: గలిగోటియాస్ యూనివర్సిటీ చెందిన విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన అనిత కుమారీ, రాజు దంపతులకు యశస్వి రాజ్ కుమారుడు ఉన్నాడు. యశస్వి రాజ్ గాల్గటియాస్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ సెకండయర్ చదువుతున్నాడు. గత బుధవారం సాయంత్రం తన తల్లికి యశస్వి పోన్ చేశాడు. ఫోన్‌లో ఛార్జీంగ్ లేకపోవడంతో తల్లితో సరిగా మాట్లాడలేదు. తన స్నేహితులతో కలిసి డంకౌర్ మార్కెట్‌కు వెళ్లామని చెప్పాడంతే. గురువారం కూడా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు యూనివర్సటీ సిబ్బందిని ఫోన్ లో అడిగారు. బయటకు వెళ్లిన యశస్వి కాలేజీకి రాలేదని యూనివర్సిటీ సిబ్బంది తిరిగి సమాచారం ఇచ్చారు. కుమారీ డంకౌర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన కుమారుడు కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. యూనివర్సీటికి 800 మీటర్ల దూరంలో మురికి కాలువలో యశస్వి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి యశస్వి స్నేహితులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి…

పెంచుకున్నందుకు పీక కోశాడు….

ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

యువతిని రైలు కింద తోసేసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News